News November 8, 2025
పెందుర్తి: అత్తను చంపి ఫైర్ యాక్సిడెంట్‌గా కథ అల్లిన కోడలు

పెందుర్తి పీఎస్ పరిధిలో కనకమహాలక్ష్మి అనే మహిళ అగ్ని ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. దేవుడి గదిలో దీపం పడి మంటలు చెలరేగడంతో తన అత్త చనిపోయినట్లు కోడలు లలితా దేవి పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా.. పాత గొడవలతో కోడలే అత్తను చంపి ప్రమాదంలో చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసినట్లు తేలిందని సీఐ సతీష్ కుమార్ శనివారం తెలిపారు.
Similar News
News March 13, 2026
ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో గృహ అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎల్పీజీ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
పెరిగిన విమాన టికెట్ల ధరలు!

ఆయిల్ ధరలు పెరగడంతో టికెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌లు విధించాలని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా వసూలు చేస్తుండగా, తాజాగా ఇండిగో కూడా పెంచింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి ₹425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ కూడా అదే దారిలో వెళ్తాయని తెలుస్తోంది. ఈమేరకు అంతర్గత చర్చలు జరుపుతున్నాయని, త్వరలో ధరలు ఖరారు చేస్తాయని సమాచారం.
News March 13, 2026
KTDM: పరీక్షల భయంతో పదో తరగతి విద్యార్థి సూసైడ్

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష్మీదేవిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అశోక్‌నగర్ మామిడితోట కాలనీకి చెందిన అప్పం నితీష్ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రమణారెడ్డి తెలిపారు.


