News November 8, 2025

కేశాలకు కర్పూరం

image

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

Similar News

News November 9, 2025

5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

image

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్‌లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.

News November 9, 2025

కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

image

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.

News November 9, 2025

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.