News November 8, 2025
వరంగల్ బల్దియాలో దోచుకుంటున్నారు..!

గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్లు, కొందరు అధికారులు ఒక్కటై రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గ్రేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు డిప్యూటీ మేయర్ స్వయంగా లేఖలో కొందరు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి ప్రజల సోమ్ముకు ఎసరు పెడుతున్నారంటూ, తక్షణమే విచారణ జరపాలని రిజ్వానా కోరారు.
Similar News
News March 22, 2026
విజయవాడలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

విజయవాడలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్క్రూ బ్రిడ్జి నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్తున్న ఓ టాటా ఏస్ వాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద వేగాన్ని తగ్గించింది. ఆ సమయంలో పక్కన ఓ కారు సైతం ఉంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు.. ముందున్న రెండు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు శ్రీశైలం నుంచి గుడివాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
News March 22, 2026
‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
News March 22, 2026
విజయవాడ: గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను బదిలీ

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుణదల సీఐగా ఉన్న వాసిరెడ్డి శ్రీను బదిలీ కాగా, ఆయన స్థానంలో సత్య రమేష్‌ను నియమించారు. అలాగే అజిత్ సింగ్ నగర్ సీఐగా చంద్రశేఖర్ నియామకమయ్యారు. అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వర నాయక్‌ను సీసీఎస్‌కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


