News November 8, 2025
రాష్ట్రస్థాయికి ధారూర్ విద్యార్థి ఎంపిక

ఉమ్మడి RR జిల్లాలో నిర్వహించిన అండర్ 14 విభాగం క్రీడా పోటీల్లో ధారూర్ KGBV విద్యార్థిని అశ్విని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం SR నగర్‌లోని క్రీడామైదానంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు నిర్వహించారు. ధారూర్ కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న అశ్విని షాట్‌పుట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. దీంతో SO స్రవంతి, PET శ్రీలత విద్యార్థిని అభినందించారు.
Similar News
News November 8, 2025
మోతె: భార్యని హత్య చేసిన భర్త అరెస్ట్

మద్యం మత్తులో తాగడానికి డబ్బులు కోసం కర్రతో కిరాతకంగా భార్యని చంపిన భర్తను మోతె పోలీసులు అరెస్ట్ చేశారు. మోతె పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి వివరాలు తెలిపారు. విభాలాపురం గ్రామానికి చెందిన బందేల్లి భార్య కరీంబీని తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కర్రతో దాడి చేయగా చనిపోయింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News November 8, 2025
పెద్దపల్లి: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దండు రాజు(47) గడ్డి మందు తాగి మరణించాడు. హమాలీ పనులు చేస్తూ మద్యానికి బానిసైన రాజు నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కిషన్ తెలిపారు.
News November 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు


