News November 8, 2025
ఫేక్ న్యూస్‌పై తుమ్మల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

ఖమ్మం: తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీతను గెలిపించాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు వచ్చిన ఫేక్ కథనాన్ని ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని బదనాం చేసేలా వార్త ప్రచురించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది BRS దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శిస్తూ, తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 6, 2026
MBNR: ఉపాధి కార్యాలయంలో కెరీర్ గైడెన్స్: రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం & నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 8, 9న శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి ఉన్నవాళ్లు https://forms.gle /a7ComMvBg6wmPXhT9 వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.
News April 6, 2026
జగిత్యాల: ప్రజావాణికి వచ్చిన యూట్యూబర్ గంగవ్వ

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి యూట్యూబర్ గంగవ్వ సోమవారం వచ్చారు. తన స్వగ్రామమైన మల్యాల మండలం లంబాడిపెల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ నాయకులు, రైతులతో కలిసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
News April 6, 2026
కనకదుర్గమ్మను దర్శించుకున్న రాజధాని రైతులు, మహిళలు

అమరావతికి శాశ్వత రాజధాని హోదా పార్లమెంట్‌లో చట్టబద్ధత పొందిన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించారు. కొండవీడు వాగు ఆనకట్ట నుంచి ఉదయం ప్రారంభమైన ఈ యాత్ర ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంద్రకీలాద్రి చేరుకుంది. ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ వారికి స్వాగతం పలికారు. ఈవో శీనా నాయక్ అమ్మవారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాలు అందజేశారు. రైతులు అన్నప్రసాదం స్వీకరించారు.


