News November 8, 2025

భద్రాద్రి రామయ్యకు నిత్య కళ్యాణ వేడుక

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదిర్చి విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి స్వామి వారికి నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Similar News

News March 14, 2026

గద్వాల: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు: కలెక్టర్

image

జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలు కానున్నాయి. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 14, 2026

కర్నూలులో 397 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 397 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,522 మందికి గాను 5,125 మంది మాత్రమే హాజరైనట్లు RIO లాలప్ప తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచామని, జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు.

News March 14, 2026

నాయుడుపేట: అదృష్టమంటే ఆమెదే మరి..!

image

చోరీకి గురైన వడ్డానం కొరియర్‌లో బాధితురాలు ఇంటికి చేరింది. నాయుడుపేట మండలం పండ్లూరు సమీపంలోని ఓ హోటల్లో ఇటీవల వేడుక జరిగింది. రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప అనే మహిళ హాజరైంది. ఆమె 16 సవర్ల వడ్డాణం చోరీకి గురైంది. బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వడ్డాణం బాధితురాలు ఇంటికి కొరియర్‌లో వచ్చింది.