News November 8, 2025

బోయినపల్లి: డ్యామ్‌పై పిచ్చి మొక్కల బెడద

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మన్వాడ వద్ద గల మిడ్ మానేరు డ్యామ్ రోడ్డుపై పిచ్చి మొక్కల బెడద ఎక్కువైంది. కొదురుపాక నుంచి డ్యామ్‌ మీదుగా వెళ్లే రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు అడ్డంగా పెరగడంతో పర్యాటకులకు, స్థానికులకు ఇబ్బందిగా మారింది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News March 12, 2026

NLG: నిప్పుల కొలిమిలా ఎండలు

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకే బయట అడుగు పెట్టాలంటే జనం జంకుతున్నారు. జిల్లాలో బుధవారం గరిష్ఠంగా గుడిపల్లిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. పెద్దవూరలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News March 12, 2026

భద్రాద్రి: విద్యార్థులు.. మన పంట.. మన భోజనం

image

అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి కళాశాల ప్రాంగణంలో ఆకుకూరలు, కూరగాయల తోటలను పెంచుతున్నారు. ఇక్కడ పండించిన తాజా కూరగాయలనే హాస్టల్ మధ్యాహ్న భోజనానికి ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో శ్రమ విలువను పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ప్రిన్సిపల్ బి.రవి తెలిపారు. విద్యార్థుల ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.

News March 12, 2026

ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం: క్యాప్ జెమినీ సీఈవో

image

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).