News November 8, 2025
రేవంత్, కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

TG: రాష్ట్రంలో <<18226951>>బ్యాడ్ బ్రదర్స్<<>> అంటే రేవంత్, KCR అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తాను తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని వారికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం ఇచ్చిందో డాక్యుమెంట్లతో సహా వివరిస్తానని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ‘రేవంత్‌ది ఫెయిల్యూర్ ప్రభుత్వం. బ్యాడ్ బ్రదర్స్ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 11, 2026
నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుచ్చి మండలంలో గతంలో బుకింగ్ చేసిన 24 గంటల్లో డెలీవరీ చేస్తుండగా.. ఇఫ్పుడు రెండు రోజులకూ ఇవ్వడం లేదు. బ్లాక్‌లో విక్రయించుకునేందుకు డీలర్లు కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో సిలిండర్ అందేలా చూడాలని కోరుతున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.
News March 11, 2026
60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.
News March 11, 2026
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


