News November 8, 2025

AFCAT నోటిఫికేషన్ విడుదల

image

ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్(MPC), BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు NOV 10 నుంచి DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20-24ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌కు 20-26ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,00-రూ.1,77,500 చెల్లిస్తారు. కోర్సు 2027 JANలో ప్రారంభమవుతుంది.

Similar News

News March 22, 2026

పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

image

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.

News March 22, 2026

SMలో నిందితుల దృశ్యాలు.. తప్పుపట్టిన సుప్రీంకోర్టు

image

నిందితుల ఫొటోలు, వీడియోలను ప్రజలు వెంటనే SMలో పోస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అలాగే సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలను పోలీసులే షేర్ చేయడం ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొంది. వీటి వల్ల పారదర్శక విచారణకు ముప్పు కలుగుతుందని తెలిపింది. ఇలాంటి వాటిని నియంత్రించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News March 22, 2026

భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తోందా?

image

రాత్రి భోజనం తిన్నాక అర్ధరాత్రి మళ్లీ ఆకలి వేసే సమస్య పెరుగుతోంది. దీంతో జంక్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని నియంత్రించడానికి నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు. ‘రాత్రి ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్, గోధుమలు, రాగులు, బ్రౌన్ రైస్ తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. పెరుగన్నం, గుప్పెడు నట్స్ తిన్నా, పసుపు కలిపిన గ్లాసు గోరు వెచ్చని పాలు తాగినా ఆకలి తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు.