News November 8, 2025
పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో CII సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని CM చంద్రబాబు చెప్పారు. పెట్టుబడుల సాధనకు మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడువులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో CM మాట్లాడుతూ ‘లోకేశ్ ఆదేశాలతో MLAల్లో కదలిక వచ్చి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం’ అని చెప్పారు.
Similar News
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 12, 2026
శుభ సమయం (12-3-2026) గురువారం

➤ తిథి: బహుళ నవమి తె.4.14 వరకు
➤ నక్షత్రం: మూల రా.10.54 వరకు
➤ శుభ సమయాలు: ఉ.7.00-7.11, ఉ.9.09-10.07, ఉ.10.57-మ.12.07, మ.1.06-మ.2.06, సా.4.04-సా.6.03
➤ రాహుకాలం: మ.1.30-మ.3.00
➤ యమగండం: ఉ.6.00-ఉ.7.30
➤ దుర్ముహూర్తం: ఉ.10.08-ఉ.10.56, మ.2.53-మ.3.40
➤ వర్జ్యం: రా.9.07-రా.10.54
➤ అమృత ఘడియలు: మ.3.49-సా.5.35
News March 12, 2026
జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు: CM రేవంత్

TG: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భారీ వాహనాలను నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. NHలకు రింగు రోడ్ల అనుసంధానం, HYD-విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలన్నారు.


