News November 8, 2025

నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

image

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News March 4, 2026

నెల్లూరు: మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.

News March 4, 2026

నెల్లూరు కలెక్టర్ చొరవ.. వృద్ధురాలికి ఇల్లు

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్‌కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్‌ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.

News March 4, 2026

నెల్లూరు: లోన్లు ఇప్పిస్తాం.. మాకేంటి..?

image

బ్యాంకు రుణాలు రిసోర్స్ పర్సన్లకు కాసులు కురిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 37వేల పొదుపు సంఘాల్లో 3.80 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది 1575.51 కోట్ల రుణ లక్ష్యానికి రూ.1301.67 కోట్లు పూర్తి చేశారు. రూ.లక్షకు రూ.5వేలు నుంచి రూ.10 వేలు వరకు గ్రూపు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.37 కోట్లు కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారని సమాచారం. మీ దగ్గర ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి.