News November 8, 2025
జన్నారం: గల్లంతైన యువకుని కోసం గాలింపు

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుని కోసం పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. జన్నారం మండల కేంద్రానికి చెందిన గుండా శ్రవణ్ శనివారం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. శ్రావణ్ జన్నారంలో ఐరన్, హార్డ్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అతని నాయనమ్మ సంవత్సరికం చేసి నదీ స్నానాకి వెళ్లి ఈ రోజు ఉదయం గల్లంతయ్యాడు.
Similar News
News March 12, 2026
అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
News March 12, 2026
పారిశ్రామిక హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూస్తాం’ అని పేర్కొన్నారు.
News March 12, 2026
ఎనుమాములలో కల్తీ కారం పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు

వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ కారంను పట్టుకున్నారు. స్థానిక సాయి ఓ ఇండస్ట్రీలో కల్తీ కారం తయారు చేస్తుండగా పక్కా సమాచారంతో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రూ.4లక్షల విలువ గల నిల్వ చేసిన కారంను స్వాధీనం చేసుకున్నారు. ఇండస్ట్రీ నిర్వాహకుడు సురేశ్‌ను స్థానిక ఎనుమాముల పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.


