News November 8, 2025
అవినీతి ఆరోపణలపై బాన్సువాడ కానిస్టేబుల్ సస్పెండ్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ భుక్య శ్రీనును ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం సస్పెండ్ చేశారు. కోర్టు కేసులకు సంబంధించి వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలడంతో చర్యలు తీసుకున్నారు. శాఖలో అనైతిక చర్యలు, అవినీతి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News March 14, 2026
విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్‌పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
News March 14, 2026
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.
News March 14, 2026
షాకింగ్.. నెల్లూరు జిల్లాలో భారీగా పెరిగిన ధరలు

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లా నుంచి నిమ్మ, గుడ్లు ఎగుమతులు పడిపోయాయి. దీంతో వాటి ధరలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా నెల్లూరులో శనివారం బాయిలర్ కోడి ధర రూ.175 పలికింది. స్కిన్‌తో కూడిన కేజీ చికెన్ రూ.304, స్కిన్ లెస్ రూ.334గా ఉంది. డిసెంబర్, జనవరిలో కోళ్లకు వైరస్ వచ్చి చనిపోవడంతో ధరలు పెరిగాయని.. రంజాన్‌కు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.


