News November 8, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌(<>IIIM)<<>> 19 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in/

Similar News

News March 5, 2026

బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

image

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్‌ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్‌’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.

News March 5, 2026

బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

image

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్‌కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్‌గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.

News March 5, 2026

కడియంపై తీర్పు రిజర్వు చేసిన స్పీకర్

image

TG: MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ కొనసాగించారు. శ్రీహరికి సంబంధించి ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్ తీర్పును రిజర్వు చేశారు. కాగా BRS పిటిషన్‌పై సమాధానమిచ్చేందుకు కొంత సమయం కావాలని దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు స్పీకర్‌ను కోరారు. మరోపక్క SC సూచనలతో కౌశిక్ రెడ్డి న్యాయవాదులు రాత పూర్వక వివరణను స్పీకర్‌కు అందించారు.