News November 8, 2025
తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 15, 2026
ADB: వ్యర్థాలతో వంటింట్లో వెలుగులు..!

జిల్లాలో పత్తి సాగు అధికం. ఏటా పంట కోత తర్వాత మిగిలే పత్తి కట్టెలను రైతులు పొలాల్లోనే తగులబెడుతుంటారు. పెరుగుతున్న గ్యాస్ ధరల నేపథ్యంలో ఈ కట్టెలే పేదలకు కొంగుబంగారంగా మారాయి. వీటిని చిన్న ముక్కలుగా చేసి ‘బ్రిక్వెట్స్’ (తెల్ల బొగ్గు)గా మార్చడం ద్వారా పొగలేని ఇంధనాన్ని పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ ఖర్చు తగ్గడమే కాక, పర్యావరణ కాలుష్యం అదుపులోకి వస్తుంది. రైతులు వీటిని అమ్మి డబ్బు సంపాదించొచ్చు.
News March 15, 2026
చిత్తూరు: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదివారం తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలలో ఎవరు గుంపులు గుంపులుగా రాదని, జెరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.
News March 15, 2026
పెద్దపల్లి: డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకానికి దరఖాస్తులు

పెద్దపల్లి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు “డ్రైవర్ ఎంపవర్‌మెంట్-2025-26” పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన యువత మార్చి 17 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.


