News November 8, 2025

48 గంటల్లో ఆలయాలు కట్టించాలి.. బండి సంజయ్ వార్నింగ్

image

రామగుండంలో 46 మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు మసీదులను వదిలి, హిందూ ఆలయాలనే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ‘48 గంటల్లో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలి లేదా మసీదులను కూల్చివేయాలి. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత నేనే వచ్చి తేలుస్తా’ అని హెచ్చరించారు.

Similar News

News November 8, 2025

ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

image

డిజిటల్, ఆన్‌లైన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.

News November 8, 2025

మెదక్: దారుణం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు

image

టేక్మాల్ మండలం వేల్పుగొండలో తల్లిని కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన సుదర్శన్ శుక్రవారం రాత్రి తల్లి సత్యమ్మ(60)తో మద్యం కోసం డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో తాగి ఉన్న అతడు కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె అనురాధ ఫిర్యాదుతో ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 8, 2025

కాలువలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు

image

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువలో బొమ్మనహాల్ హెచ్ఎల్సీ సెక్షన్ పరిధిలో 116 కిలోమీటర్ల వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. శనివారం సాయంత్రం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలు ఎవరివనే సమాచారం తెలియ రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.