News April 11, 2024
విశాఖ: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అచ్చుతాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అచ్చుతాపురం-ఎలమంచిలి రోడ్డులో బైక్‌పై వెళుతున్న దుప్పుతురుకి చెందిన గొల్లపల్లి శేఖర్, అమలతో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. లారీ చక్రాల కింద మృతదేహం నుజ్జునుజ్జవ్వడంతో అతడి వివరాలు గుర్తించలేకపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపడుతున్నారు.
Similar News
News March 12, 2026
ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం: క్యాప్ జెమినీ సీఈవో

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేశ్ గురువారం విశాఖలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ అన్నారు. 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది).
News March 12, 2026
విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. విశాఖలో ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. నగరం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో క్లౌడ్, బీపీఎం సేవల కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తెలిపారు.
News March 12, 2026
విశాఖలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. అయితే విశాఖలో క్యాప్ జెమిని ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ నేడు భేటీ కానున్నారు.


