News November 8, 2025
మచిలీపట్నం: కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.
Similar News
News March 25, 2026
సౌత్ ఇండియా ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు

కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 29 వరకు జరిగే దక్షిణ భారత విశ్వవిద్యాలయాల పురుషుల ఖోఖో పోటీలకు కృష్ణా యూనివర్సిటీ జట్టు బుధవారం బయలుదేరింది. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మేక రమేశ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణారెడ్డి, కోచ్ మనోహర్ పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
News March 25, 2026
అవనిగడ్డ నియోజకవర్గం రెండు అవుతుందా..?

2 లక్షలపైచిలుకు జనాభాతో 6 మండలాలతో విస్తరించి ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంపై పునర్విభజన ఎఫెక్ట్ పడనుంది. సమీప ప్రాంతాలతో కలిపి అవనిగడ్డను రెండు నియోజకవర్గాలుగా విభజించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాలతో కలిపి చల్లపల్లి నియోజకవర్గం ఏర్పడవచ్చని, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాలతో ప్రస్తుత అవనిగడ్డ నియోజకవర్గం కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
News March 25, 2026
కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం పామర్రు ఒక్కటే SC నియోజకవర్గం. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.


