News November 8, 2025
ఏలూరు: భక్త కనకదాసుకు నివాళులర్పించిన కలెక్టర్

భక్త కనకదాసు జీవితం మనందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి కార్యక్రమం జరిగింది. భక్త కనకదాసు చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భక్త కనకదాసు విశిష్టమైన కవిగా, తత్త్వవేత్తగా, గొప్ప సామజిక సంస్కర్తగా పేరుగాంచారని కొనియాడారు. ఆయన రచనలు, కీర్తనలు ప్రజలకు భక్తిని మానవత్వాన్ని బోధించాయన్నారు.
Similar News
News November 8, 2025
త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.
News November 8, 2025
సోమశిలలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి

సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమశిలలో శనివారం సాయంత్రం సందడి చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిల లోని విఐపి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఏకో టూరిజం ఏర్పాటు చేసిన లాంచ్‌లో కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణించి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. గుర్తించకుండా ముఖానికి మాస్క్ ధరించి అక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
News November 8, 2025
పోలీసు వ్యవస్థలో కోర్టు కానిస్టేబుల్స్ కీలక పాత్ర: ఎస్పీ

కోర్టు కానిస్టేబుల్స్ పోలీసు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, సమయపాలన, నిబద్ధతతో పనిచేయాలని SP సునీల్ షెరాన్ పేర్కొన్నారు. జిల్లా నేర ఘణాంకాల సేకరణ, విశ్లేషణ, నిర్వహణ సంస్థ(DCRB) పోలీసు అధికారుల సమక్షంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం అధికార సిబ్బందితో కేసుల స్థితిగతులపై సమావేశం నిర్వహించారు. ప్రతీ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు సమయానికి కోర్టులకు చేరేలా చూడాలన్నారు.


