News November 8, 2025
వనపర్తి: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ

వనపర్తి జిల్లాలో వాహనాల పరిమితికి మించి ప్రయాణించకూడదని ఎస్పీ రావుల గిరిధర్ వాహన చోదకులను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోగలరని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
Similar News
News March 5, 2026
బాపట్ల: విద్య భవన్‌తో అన్ని కార్యాలయాలు ఒకే చోట

బాపట్లలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద విద్య భవన్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. 49 సెంట్ల విస్తీర్ణంలో విద్యాశాఖకు చెందిన అన్ని కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేసేలా విద్య భవన్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌ను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
News March 5, 2026
బిహార్‌లో తొలి బీజేపీ సీఎం.. రంగం సిద్ధం!

మోదీ నేతృత్వంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJP అనేక రాష్ట్రాలపై పట్టు సాధిస్తూ వస్తోంది. ఈ జాబితాలో బిహార్ కూడా చేరనుంది. సీఎం నితీశ్ RSకు వెళ్లనుండటంతో ఆయన స్థానంలో తొలిసారి <<19302367>>BJP నేత<<>> CM పీఠం ఎక్కే అవకాశం ఉంది. 2014 తర్వాత అస్సాంలో శర్బానంద, మణిపుర్‌లో బీరేన్‌సింగ్, త్రిపురలో బిప్‌లాబ్, హరియాణాలో మనోహర్, అరుణాచల్‌లో పెమా ఖండు, ఒడిశాలో మోహన్ BJP నుంచి తొలిసారి CMలు అయ్యారు.
News March 5, 2026
VZM: మిషన్ హార్టీ విజన్‌తో ఉద్యాన సాగు విస్తరణ

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


