News November 8, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్‌కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్‌ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్‌లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.

Similar News

News March 16, 2026

TODAY HEADLINES

image

* TN, కేరళం, అస్సాం, W.బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలకు మోగిన నగారా
* మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం: రేవంత్
* TG: ఈ నెల 22న రైతు భరోసా నిధుల విడుదల
* నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR
* నేను ఎలాంటి తప్పు చేయలేదు: పుట్టా మహేశ్
* పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం
* సినిమా నాకు అన్నం పెట్టింది: పవన్
* డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డికి 14రోజుల రిమాండ్

News March 16, 2026

ఆస్కార్స్‌‌లో మెరవనున్న భారతీయ అందం

image

లాస్ ఏంజెలిస్‌లో రేపు ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఇండియన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మొదలవుతుంది. వేదికపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సందడి చేయనున్నారు. పలువురు విజేతలకు ఆమె ఆస్కార్ అవార్డులు ప్రజెంట్ చేస్తారు. గతంలో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినప్పుడు దీపికా పదుకొణె అంతర్జాతీయ స్టేజీపై మెరిసిన విషయం తెలిసిందే.

News March 15, 2026

‘ఉస్తాద్’ అందుకే లేట్ అయింది: హరీశ్ శంకర్

image

కథ మారినందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఆలస్యమైందని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. తొలుత అనుకున్న స్టోరీ సెట్ కాకపోవడంతో స్క్రిప్ట్ మార్చడం, కరోనా వంటి కారణాలతో లేట్ అయిందన్నారు. ఈ జర్నీలో ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆలస్యంపై కొందరు కథలుకథలుగా మాట్లాడుకున్నారని, అది సృష్టి ధర్మమని హరీశ్ సెటైర్ వేశారు. ఈ సారి పండుగ ఉస్తాద్ ఉగాది అన్నారు.