News November 8, 2025
48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.
Similar News
News March 22, 2026
F-16 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చిందా?

ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో జరిగిన ఆపరేషన్‌లో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయని IRGC ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఈ వాదనను కొట్టిపారేసింది. తమ విమానంపై క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, కానీ పైలట్లు సేఫ్‌గా మిషన్‌ను పూర్తి చేసి తిరిగి వచ్చారని స్పష్టం చేసింది. విమానానికి ఎలాంటి డ్యామేజ్ కాలేదని పేర్కొంది.
News March 22, 2026
‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
News March 22, 2026
కుల మీటింగ్స్‌కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.


