News April 11, 2024

విషాదం: ఎంగేజ్‌మెంట్ రోజే నటుడు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌ నటుడు సూరజ్ మెహర్(40) మరణించారు. నిన్న సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే నిన్న రాత్రి సూరజ్ ఎంగేజ్‌మెంట్ జరగాల్సి ఉంది. ‘ఆఖ్రి ఫైస్లా’ సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. సూరజ్ విలన్ పాత్రలతో గుర్తింపు పొందారు.

Similar News

News March 22, 2026

అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

image

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News March 22, 2026

అమెరికా దాడుల్లో 20 రోజుల పాప మృతి!

image

అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఖజ్విన్‌కు చెందిన 20 రోజుల పాప చనిపోయినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ పేర్కొంది. US-అమెరికా దాడులు ప్రారంభించినప్పటి (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇందులో 200 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో పసి ప్రాణాలు బలవ్వడం బాధాకరమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.

News March 22, 2026

కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

image

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.