News November 8, 2025
కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మంది అరెస్టు

అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను హత్య కేసులో 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ రాహుల్ మీనా శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. తన ఉనికిని చాటుకునేందుకే ప్రధాన నిందితుడు కాసుబాబు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. దూషిస్తూ శ్రీను విడుదల చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువు పోతుందని భావించి హత్యకు ప్లాన్ చేశాడని చెప్పారు.
Similar News
News March 18, 2026
ప.గో: రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 3 గంటల్లో ఉమ్మడి ప.గో జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని AP విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలెవ్వరూ విద్యుత్ తీగలు తాకవద్దన్నారు. చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.
News March 18, 2026
10న తిరుపతిలో రోబోటిక్స్ పోటీలు

తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్(RSC) ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు ‘ROBOTRAC 3.0’ అటానమస్ రోబోట్ ఛాలెంజ్ జరగనుంది. ఇద్దరు విద్యార్థులుంటే ప్రతి జట్టు పోటీ వేదికపైనే స్వయంగా లైన్-ఫాలోయింగ్ రోబోలను తయారు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 6వ తేదీ లోపు https://tinyurl.com/robotrac3rsct ద్వారా అప్లై చేసుకోవాలి.
News March 18, 2026
ఈ టీమ్స్ టాపార్డర్ చూస్తే వణకాల్సిందే..

IPLలో ఈ సారి చాలా జట్ల టాపార్డర్ బలంగా ఉంది.
*SRH: అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్, క్లాసెన్
*MI: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, విల్ జాక్స్
*CSK: మాత్రే, శాంసన్, గైక్వాడ్, శివమ్ దూబే
*KKR: అలెన్, సీఫర్ట్, గ్రీన్, రహానే
*LSG: మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్
*PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్
> వీటిలో ఏ టీమ్ విధ్వంసకరంగా ఉందో కామెంట్ చేయండి.


