News November 8, 2025

HYD-VJD హైవే 8 లేన్లకు విస్తరణ: కోమటిరెడ్డి

image

HYD-VJD జాతీయ రహదారి 8 లేన్లకు విస్తరించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10,400 కోట్లతో ఈ రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. దండు మల్కాపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ఈ రోడ్డును ఎక్స్ ప్యాండ్ చేస్తామన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 4 వరుసల రోడ్డు 8 వరుసలుగా మారనుంది. గతంలో ఆరు లేన్లుగా నిర్మించాలనుకున్నప్పటికీ రద్దీ దృష్ట్యా 8 లేన్లుగా విస్తరించనున్నారు.

Similar News

News March 13, 2026

వికారాబాద్‌లో మసాలా దోశ రూ.60 అంట!

image

ఇటీవలి గ్యాస్ కొరతతో టిఫిన్ సెంటర్లలో ధరలు పెరుగుతున్నాయి. ఓ టిఫిన్ సెంటర్‌లో మసాలా దోశ ధర రూ.60గా నిర్ణయించడంతో కస్టమర్లు నోరెళ్లబెడుతున్నారు. కారణం అడగగా, గ్యాస్ కొరతతో, ఖర్చులు పెరిగినందున ధరలు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. దీనిపై ఎవరికి కంప్లైంట్ చేయాలని, ఈ పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

News March 13, 2026

ఇరాన్‌లో ఈరోజు ఏం జరుగుతుందో చూడండి: ట్రంప్

image

ఇరాన్‌పై నేడు విరుచుకుపడనున్నట్లు అమెరికా హింట్ ఇచ్చింది. ఈరోజు ఏం జరుగుతుందో చూడండని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌కు నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవని.. మిసైల్స్, డ్రోన్లను కూడా ధ్వంసం చేస్తున్నామన్నారు. US అంచనా తప్పిందన్న కథనాలకు కౌంటర్ ఇస్తూ.. వాటిని చదివి అమెరికా ఓడిపోతోందని భ్రమపడొద్దని ప్రజలకు సూచించారు. 47ఏళ్లుగా అమాయకులను చంపుతున్న వారిని US 47వ అధ్యక్షుడిగా అంతం చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు.

News March 13, 2026

VZM: ‘అక్షరాంధ్ర పరీక్షకు 99% హాజరు కావాలి’

image

ఈనెల 15న నిర్వహించనున్న అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 99% హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫిరెన్స్‌ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో 1.10 లక్షల మందిని అక్షరాంధ్ర కింద గుర్తించామని, వారందరూ అక్షరాస్యులుగా మారాలని అన్నారు. పరీక్ష అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.