News November 8, 2025

లాలూ 7 జన్మలెత్తినా మోదీ కాలేరు: అమిత్ షా

image

ఏడు జన్మలెత్తినా లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ కుంభకోణాలు చేయలేరని కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. రైల్వేకు లాలూ తీసుకొచ్చిన లాభాలను మోదీ ఎన్నటికీ తీసుకురాలేరన్న తేజస్వీ యాదవ్ కామెంట్లకు షా కౌంటరిచ్చారు. బిహార్‌లోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అక్రమ వలసదారులను గుర్తిస్తామని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి దేశం నుంచి పంపిస్తామని చెప్పారు.

Similar News

News November 8, 2025

మురికి కాలువల పక్కన కొత్త ఇల్లు కట్టొచ్చా?

image

మురికి కాలువల సమీపంలో ఇల్లు కట్టుకోవడం ఆరోగ్యానికి హానికరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. మురికి కాలువల వల్ల అపరిశుభ్రత, కాలుష్యం పెరిగి, దుర్గంధం కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఆయన సూచన. ‘నివాస స్థలంలో శుభ్రత, స్వచ్ఛత లేకపోతే అక్కడ సానుకూల శక్తి నిలవదు. అందుకే శుభ్రత, ప్రశాంతత ఉండే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి’ అని వాస్తు శాస్త్రం చెబుతోంది. <<-se>>#Vasthu<<>>

News November 8, 2025

చైతూ-సామ్ విడాకులకు రాజ్‌తో రిలేషనే కారణమా?

image

సమంత, డైరెక్టర్ రాజ్ క్లోజ్‌గా ఉన్న <<18231711>>ఫొటో వైరల్<<>> అవడంతో నాగచైతన్యతో ఆమె విడిపోవడానికి ఈ రిలేషనే కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చైతూతో విడిపోకముందు రాజ్ డైరెక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మాన్-2’ సిరీస్‌లో సమంత నటించారు. అయితే ఆ సమయంలోనే రాజ్, సామ్ మధ్య రిలేషన్ ఏర్పడి ఉండొచ్చని, అదే చైతూ-సామ్ విడాకులకు కారణమని పలువురు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు సామ్‌కు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.

News November 8, 2025

శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనలో షాకింగ్ నిజాలు

image

AP: తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ విచారణలో కీలక అంశాలు బయట పడుతున్నాయి. మోనో గ్లిజరాయిడ్స్, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను వినియోగించి పామాయిల్‌గా మార్చి దాన్నే నెయ్యిగా లడ్డూ తయారీకి పంపారని సిట్ గుర్తించింది. బోలే బాబా డెయిరీలో తయారైన నెయ్యిలో 90 శాతం పామాయిల్ ఉన్నట్లు కనుగొంది. సబ్ కాంట్రాక్టర్‌ అజయ్ కుమార్, బోలే బాబా కంపెనీ కలిసి అక్రమాలకు పాల్పడినట్లు సిట్ వర్గాలు పేర్కొన్నాయి.