News November 8, 2025

తిరుపతి: న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

image

న్యూ లుక్‌లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ కోడ్‌తో తిరుపతిలో ఆయన పర్యటించారు. కెన్నెట్ అండర్సన్ రాసిన మ్యాన్ ఈటర్స్ అండ్ జంగల్ కిల్లర్స్ బుక్‌ను ఫారెస్ట్‌లో చదివి ఆహ్లాద వాతావరణంలో ఆనందంగా కనిపించారు. మామండూరు అందాలకు మంత్రముగ్ధుడయ్యారు. జలపాతం అందాలను చూసి మైమరచి పోయారు. 105 ఏళ్ల నాటి అతిథి గృహాన్ని సందర్శించడంతోపాటు ఆ ప్రదేశంలో మొక్కలు కూడా నాటారు.

Similar News

News November 8, 2025

త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

image

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

News November 8, 2025

సోమశిలలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి

image

సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోమశిలలో శనివారం సాయంత్రం సందడి చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న సోమశిల లోని విఐపి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఏకో టూరిజం ఏర్పాటు చేసిన లాంచ్‌లో కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణించి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు. గుర్తించకుండా ముఖానికి మాస్క్ ధరించి అక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

News November 8, 2025

పోలీసు వ్యవస్థలో కోర్టు కానిస్టేబుల్స్ కీలక పాత్ర: ఎస్పీ

image

కోర్టు కానిస్టేబుల్స్ పోలీసు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, సమయపాలన, నిబద్ధతతో పనిచేయాలని SP సునీల్ షెరాన్ పేర్కొన్నారు. జిల్లా నేర ఘణాంకాల సేకరణ, విశ్లేషణ, నిర్వహణ సంస్థ(DCRB) పోలీసు అధికారుల సమక్షంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం అధికార సిబ్బందితో కేసుల స్థితిగతులపై సమావేశం నిర్వహించారు. ప్రతీ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు సమయానికి కోర్టులకు చేరేలా చూడాలన్నారు.