News November 8, 2025
పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.
Similar News
News March 16, 2026
NGKL: పోలీస్ ప్రజావాణికి 11 దరఖాస్తులు

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 11 దరఖాస్తుల స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 16, 2026
NTR: పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశా

NTR జిల్లాలో పదో తరగతి తొలిరోజు పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ లక్ష్మీశా, DEO చంద్రకళతో కలిసి గవర్నర్‌పేటలోని సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
టెన్త్ పరీక్షలు.. తిరుపతి జిల్లాలో 552 మంది గైర్హాజరు

సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026 ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 27,243 మంది విద్యార్థులకు గాను 26,691 మంది. హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 885 మందికి గాను 785 హాజరు అయినట్లు DEO KVN కుమార్ పేర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.


