News November 8, 2025
రేవులపల్లి VOAపై అసత్య ప్రచారం తగదు- తిమ్మప్ప

ధరూర్ మండలం రేవులపల్లి VAOపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, అది తగదని VAOల సంఘం గద్వాల జిల్లా కార్యదర్శి సంగాల తిమ్మప్ప పేర్కొన్నారు. శనివారం జిల్లా సీఐటీయూ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గతంలో వీఏఓ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆడిట్ జరిగిందన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు.
Similar News
News March 6, 2026
22-ఏ నిషేధిత భూముల జాబితా శుద్ధిపై కలెక్టర్ సమీక్ష

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సెక్షన్ 22-ఏ నిషేధిత భూముల జాబితా శుద్ధిపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ భూములు, చట్టపరంగా నిషేధిత భూములు మాత్రమే ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచాలని సూచించారు.
News March 6, 2026
మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం: CM

TG: మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని CM రేవంత్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరిస్తామని తెలిపారు. రంగారెడ్డి(D) కొత్వాల్‌గూడలో ఎకో పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
News March 6, 2026
ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.


