News November 8, 2025
కొండాపూర్ శివారులో రోడ్డుప్రమాదం.. ఆటోడ్రైవర్ మృతి

మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అనుమల్ల గంగాధర్(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 4న గంగాధర్ భీమారం నుంచి కొండాపూర్ వైపు ఆటోలో వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన గంగాధర్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో కేసు నమోదైంది.
Similar News
News March 31, 2026
దుర్గమ్మ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ చేతివాటం

AP: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గోల్డ్ అప్రైజర్ షమ్మీ దొంగతనానికి ప్రయత్నించాడు. ఆలయంలో సోమవారం కానుకలు లెక్కించారు. మూటల రూపంలో వచ్చిన కానుకల్లో డబ్బు, బంగారం, వెండి తీసి అందులోని వ్యర్థాలను తగలబెడతారు. వ్యర్థాలు వేసే చెత్త బుట్టతో షమ్మీ కిందకు వెళ్తుండగా బోర్డ్ సభ్యులు పరిశీలించగా రూ.1.30లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు లభించాయి. ఈవో స్పందించి అతనికి నోటీసులు ఇచ్చారు.
News March 31, 2026
WGL: 8,297 మందికి షాక్!

ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరిలో గరిష్ఠ వినియోగం కారణంగా 8,297 మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకం దూరమైంది. 200 యూనిట్ల పరిమితి దాటడంతో వీరికి జీరో బిల్లుల బదులు చెల్లింపులు తప్పలేదు. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మార్చిలో మరికొందరికీ జీరో బిల్లు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 4 రోజుల్లో బిల్లులు రానున్నాయి
News March 31, 2026
మారేడుమిల్లి: ‘ఏకలవ్య పరీక్షలకు గంట ముందే చేరుకోవాలి’

పోలవరం జిల్లాలో ఏప్రిల్ 4న ఏకలవ్య విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష జరుగుతుందని జిల్లా పరీక్షల కన్వీనర్ శంకర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాల్లో 1,445 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారని తెలిపారు. 100 మార్కులకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 11.40కు ప్రారంభం అవుతుందన్నారు. ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.


