News November 8, 2025
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
Similar News
News March 22, 2026
మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర రూ.390!

మచిలీపట్నం మాంసం మార్కెట్‌లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా ఉన్నప్పటికీ, ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణంలో చికెన్ స్కిన్‌లెస్ రూ. 390 పలుకుతోంది. మటన్ కిలో రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చేపల మార్కెట్‌లో బొచ్చె రూ. 200, సీలావతి రూ. 170కి విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 22, 2026
కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

కేరళంలోని కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
News March 22, 2026
ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్

ఎలాంటి కండీషన్స్ లేకుండా హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల గడువు విధించారు. లేదంటే ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే ఇరాన్ అణుకేంద్రం సమీపంలో మిస్సైల్ దాడులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ ‘అల్టిమేటం’ హాట్ టాపిక్‌గా మారింది.


