News November 8, 2025
గద్వాల: రేపు న్యాయవాదుల పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం 9:00 గంటలకు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయం నుంచి హైదరాబాద్ వైపు పాదయాత్ర మొదలవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు శనివారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ బంధువులందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 13, 2026
‘క్రీమీ లేయర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా సంస్థల్లో వారి పదవులు, హోదానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్స్ పరీక్షను క్లియర్ చేసినా క్రీమీ లేయర్‌లో పొరపాటున చేర్చడంతో నష్టపోయిన అభ్యర్థులకు ఊరట కల్పించింది. వారి అపాయింట్‌మెంట్స్‌ను నిరాకరిస్తూ కేంద్రం వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.
News March 13, 2026
క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటే?

OBC కేటగిరీని క్రీమీ/నాన్ క్రీమీ లేయర్ అని 2 రకాలుగా విభజిస్తారు. ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెంది, వార్షికాదాయం ₹8Lకు పైగా(జీతం, వ్యవసాయ ఆదాయం మినహాయించి) ఉంటే క్రీమీ లేయర్‌గా పరిగణిస్తారు. వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఆదాయ పరిమితి ఏడాదికి ₹8L కంటే తక్కువగా ఉన్న వారిని నాన్ క్రీమీలేయర్‌గా పరిగణించి ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తారు.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.


