News November 8, 2025

ఇడుపులపాడు చెరువులో 16 ఏళ్ల యువకుడు గల్లంతు

image

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినప్పటికీ లైట్లు వేసి గాలిస్తున్నారు.

Similar News

News March 20, 2026

నాగార్జునసాగర్ చేపల ఫ్రై రుచికి పర్యాటకులు ఫిదా

image

నాగార్జునసాగర్ జలాశయం తాజా చేపల వంటకాలకు పెట్టింది పేరు. ఇక్కడ దొరికే చేపలతో చేసే స్పెషల్ ఫ్రై రుచికి స్థానికులతో పాటు వెయ్యి మందికి పైగా పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రత్యేక మసాలాలతో వేయించిన ఈ చేపలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. సాగర్ రోడ్డు వెంట ఉన్న సుమారు 10 హోటళ్లు, స్టాళ్లలో తాజాగా పట్టిన చేపలను విక్రయిస్తున్నారు. సాగర్ సందర్శనకు వచ్చే వారు ఈ అమోఘమైన రుచిని అస్సలు వదులుకోవడం లేదు.

News March 20, 2026

నల్గొండ కేవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నల్గొండ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతి, బాలవాటిక-3లో చేరేందుకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే 2 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 2 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

News March 20, 2026

మెదక్: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని సూచించారు. ఈ నెల 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. #SHARE IT