News November 8, 2025

త్వరలోనే మహిళలకు రూ.2,500: జగ్గారెడ్డి

image

TG: వృద్ధులకు రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 సాయం అందించే పథకాలు త్వరలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. ఈ స్కీముల అమలుకు సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారని, నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని మీడియా సమావేశంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

Similar News

News April 3, 2026

ఇరాన్‌లో కాదు.. USలో ‘పాలన’ మారుతోంది!

image

ఇరాన్‌లో <<16787359>>పాలన మార్పు<<>> జరగాలని US అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ ఇరాన్ ప్రతిఘటనతో అది సాధ్యం కాలేదు. అందుకు విరుద్ధంగా US ప్రభుత్వంలో మార్పులు జరుగుతున్నాయి. కీలక ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్‌పై <<19554260>>వేటువేశారు<<>>. FBI చీఫ్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్, మరో ఇద్దరి తొలగింపుపైనా చర్చలు జరిగాయని సమాచారం. ఇంకెంత మందిపై వేటు పడుతుందో?

News April 3, 2026

YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

image

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.

News April 3, 2026

అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>