News November 8, 2025
న్యూస్ రౌండప్

▶ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని కలిసిన PM మోదీ. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విషెస్
▶ USలో అనారోగ్యంతో APలోని కారంచేడుకు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి(23) మృతి
▶ UPA హయాంలో 88వేల మంది అక్రమ వలసదారులను తిప్పి పంపామన్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
▶ బిహార్ ఎన్నికల వేళ అన్నదమ్ములు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ మధ్య ముదిరిన వైరం.. సోదరుడితో ఇక ఎన్నటికీ బంధం ఉండదన్న తేజ్ ప్రతాప్
Similar News
News March 6, 2026
మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం: CM

TG: మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని CM రేవంత్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరిస్తామని తెలిపారు. రంగారెడ్డి(D) కొత్వాల్‌గూడలో ఎకో పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
News March 6, 2026
ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.
News March 6, 2026
ముస్లిం దేశాల్లో పాక్ దగ్గరే న్యూక్లియర్ వెపన్.. ఎలా?(1/2)

ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేయడంతో పాక్ వణికిపోయింది. ‘గడ్డి తినైనా సరే అణుబాంబు సాధిస్తాం’ అని అప్పటి PM భుట్టో శపథం చేశారు. సైంటిస్ట్ AQ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి డిజైన్లు దొంగిలించి గ్లోబల్ బ్లాక్ మార్కెట్ సాయంతో ప్రాజెక్ట్-706 స్టార్ట్ చేశారు. పాక్ చేస్తున్నది తప్పని తెలిసినా రష్యాతో పోరాడేందుకు సాయపడుతుందని US సైలెంట్‌గా ఉండిపోయింది. చైనా సాయపడటంతో 1980ల నాటికే పాక్ లక్ష్యం చేరుకుంది.


