News November 8, 2025

నాగిరెడ్డిపేట: పురుగుల మందు సేవించి వృద్ధురాలి మృతి

image

నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలన్ గ్రామానికి చెందిన రోడ్డ రత్నవ్వ (70) పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది రత్నవ్వ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుమార్తె రోడ్డ సాయవ్వ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News March 18, 2026

ICC ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

image

ICC ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో NZ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలిచారు. భారత బ్యాటర్లు కోహ్లీ(2), రోహిత్(4), గిల్(5), రాహుల్ (9) టాప్-10లో ఉన్నారు. బౌలింగ్‌లో భారత్ నుంచి కుల్దీప్(8) ఒక్కరే టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నారు. అటు T20 బ్యాటింగ్‌లో అభిషేక్(1), ఇషాన్(2), తిలక్(6), సూర్య(9) టాప్-10లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ 2, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు.

News March 18, 2026

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షలు.. 387 మంది డుమ్మా..!

image

జిల్లాలో బుధవారం 31 కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు. నేడు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 1,969 మంది మాత్రమే పరీక్ష రాశారు. 387 మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కడప మున్సిపల్ ఉర్దూ బాలుర పాఠశాల కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

News March 18, 2026

పెద్దపల్లి: 9 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో పదవ తరగతి రెండవ రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద తెలిపారు. మొత్తం 7,489 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,480 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.9 శాతం హాజరు నమోదైంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.