News November 8, 2025

బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News March 12, 2026

IPL: RCBకి షాక్?

image

ఐపీఎల్-19వ సీజన్ ప్రారంభం కాకముందే డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టు కీలక బౌలర్, గతేడాది RCB లీడ్ వికెట్ టేకర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సీజన్‌‌లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. గాయం కారణంగా ఇప్పటికే T20WCకి దూరమైన అతడి ఫుల్ రికవరీకి టైమ్ పట్టొచ్చని సమాచారం. ఇక లీగల్ ఇష్యూస్ కారణంగా ఆ జట్టు మరో బౌలర్ యశ్ దయాల్ పాల్గొనడంపైనా సందిగ్ధం నెలకొంది.

News March 12, 2026

ఇక్కడ వందల ఏళ్లుగా వర్షం కురవలేదు!

image

ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారి ఒకటి. ఆశ్చర్యకరంగా ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్లుగా ఒక్క చుక్క వర్షం కూడా కురవలేదు. విపరీతమైన పొడి వాతావరణం వల్ల ఇక్కడ జీవరాశి మనుగడ సాగించడం చాలా కష్టం. కనీసం గడ్డి కూడా మొలవదు. భూమిపై అంగారక గ్రహం వంటి పరిస్థితులు ఉండే ఏకైక ప్రదేశం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 12, 2026

జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

image

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.