News November 9, 2025

HYD: సైకో పోవాలి.. సారే రావాలి: రైతు సురేశ్

image

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌లో KTR రోడ్ షో నిర్వహించారు. బైపోల్ సందర్భంగా నగరంలో రకరకాల ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న BRS రోడ్ షోలో వనస్థలిపురం వారిది ‘రప్ప రప్ప’ పోస్టర్ కనిపించగా, ఇవాళ ‘సైకో పోవాలి..సారే రావాలి’ అనే క్యారీక్రేచర్ పోస్టర్‌ను రైతు సురేశ్ ప్రచారం రథం వద్ద ప్రదర్శించారు. ఏదేమైనా ఇరుపార్టీల బ్యానర్‌ల పంచాయితీ తారస్థాయికి చేరింది.

Similar News

News March 21, 2026

నాగార్జునసాగర్, మూసీకి తగ్గిన నిధులు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పనులకు బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులను భారీగా తగ్గించింది. గతేడాది రూ.297.95 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.196.85 కోట్లకే పరిమితం చేసింది. ఈ నిధులతోనే డ్యాం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టాల్సి ఉంది. అలాగే గతంలో మంజూరు చేసిన 15 ఎత్తిపోతల పథకాల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. ఇక మూసీ ప్రాజెక్టుకు గతేడాది రూ.50 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.30.15 కోట్లకు కుదించింది

News March 21, 2026

ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

image

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.

News March 21, 2026

HYD: భట్టి కుమారుడి రిసెప్షన్‌లో సీఎం దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య- సాక్షి వివాహ రిసెప్షన్ HYD శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను రేవంత్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.