News November 9, 2025
ఈనెల 11న ఆగిరిపల్లిలో జాబ్ మేళా: మంత్రి

ఏపీలోని యువతకు ఉద్యోగ కల్పన కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఆగిరిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఈనెల 11 మంగళవారం ఉదయం 9గం: నుంచి జాబ్ మేళా జరుగుతుందన్నారు. జిల్లా నుంచి ఏ ప్రాంతం వారైనా ఈ జాబ్‌లో పాల్గొనవచ్చన్నారు. 10వ తరగతి నుంచి తదితర చదువుల్లో పాసైన 18-35 ఏళ్ల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో జాబ్ మేళాకు రావాలన్నారు.
Similar News
News March 20, 2026
గోదావరి నదిలో గల్లంతైన వారి వివరాలు ఇవే..!

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలోకి దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.
News March 20, 2026
‘పోలవరం జిల్లాలో గ్యాస్ కొరత లేదు’

పోలవరం జిల్లాలోని 8గ్యాస్ ఏజెన్సీలలో 1872 వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ విజయ భాస్కర్ శుక్రవారం తెలిపారు. రంపచోడవరంలో జీసీసీ గ్యాస్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ బుక్ ప్రకారం 352 సిలిండర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి కొరతలేదని, బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం 352 మంది గ్యాస్ కోసం నమోదు చేసుకున్నారన్నారు.
News March 20, 2026
పండుగలు సమాజానికి కళాశోభను ఇస్తాయి: చిత్రకారుడు రుస్తుం

పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన గీసిన ‘రంజాన్ ముబారక్’ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావానికి, సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. సమాజంలో ధనవంతులు పేదవారి ఆకలిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు. పవిత్ర ఖురాన్ మార్గంలో నడుస్తూ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.


