News November 9, 2025
విజయవంతమైన జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీ

ప్రొద్దుటూరులోని జార్జ్ కోరోనేషన్ క్లబ్ వద్ద జిల్లాస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ప్రారంభించారు. 36 మండలాల నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులను ఎన్నికచేసినట్లు వివరించారు. వీరు ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న విద్యార్థుల మాక్ అసెంబ్లీలో పాల్గొటారన్నారు.
Similar News
News March 4, 2026
కడప: ప్రత్యేక విభాగాల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్ష

ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నేర చరిత్ర కలిగిన వారిపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు.
News March 4, 2026
కడప: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు.?

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్‌మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్‌ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
News March 4, 2026
వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా వైవీయూ ఫలితాలు

వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా YVU నిర్వహించే అన్ని పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చని వర్సిటీ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. వాటికి సంబంధించిన పోస్టర్లను కులసచివులు పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి కృష్ణారావుతో కలిసి ఆవిష్కరించారు. వి.సి మాట్లాడుతూ.. ప్రభుత్వం వాట్సాప్(9552300009) ఇంటిగ్రేటెడ్ సేవల ద్వారా ఫలితాలు వెంటనే సెల్‌లో పొందవచ్చన్నారు.


