News November 9, 2025

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు.. రంగంలో దిగిన పోలీసులు

image

బల్లికురవ మండలానికి చెందిన రాజేష్‌ను క్వారీ పని నుంచి తొలగించారంటూ శనివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని రాద్ధాంతం చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే బల్లికురవ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అల్లిపురం ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతనికి నచ్చజెప్పి విజయవంతంగా అతన్ని కిందకు దించారు.

Similar News

News March 25, 2026

ఉద్యోగ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

image

జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలలో ప్రతిభ చూపిన జిల్లా ఉద్యోగుల క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మంగళవారం రాత్రి తన ఛాంబర్‌లో వారికి పతకాలను అందజేశారు. ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జరిగిన జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ ఖోఖో పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు విశేష ప్రతిభ కనబరచి కాంస్య పతకాన్ని సాధించింది.

News March 25, 2026

చిత్తూరు: మామిడి దిగుబడిపై అధికారులు అంచనా

image

జిల్లాలో మామిడి దిగుబడి అంచనాను ఉద్యాన శాఖ అధికారులు పూర్తి చేశారు. తోతాపురి 40024 హెక్టార్లకు 483981 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చునని అంచనా వేశారు. అలాగే బేనీషా 6856 హెక్టార్లకు 42242 టన్నులు, కాదర్ 2702 హెక్టార్లకు 18834 టన్నులు, నీలం 5178 హెక్టార్లకు 42242 టన్నులు, మల్లిక 1349 హెక్టార్లకు 10444 టన్నులు, ఇతర రకం 3217 హెక్టార్లకు 23509 టన్నుల దిగుబడి వచ్చే ఛాన్స్ ఉందని వివరించారు.

News March 25, 2026

షేన్ వార్న్ దూరదృష్టి.. RR డీల్‌తో పిల్లలకు భారీ ఆస్తి!

image

RR మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్ ముందుచూపు ఎలాంటిదో ఇప్పుడు రుజువైంది. IPL ప్రారంభంలో 4 సీజన్లకు కలిపి కేవలం ₹9.35 కోట్ల శాలరీ మాత్రమే తీసుకున్న ఆయన రిటైర్మెంట్ డీల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లో 0.75% వాటా కావాలని కండిషన్ పెట్టారు. అలా 4 ఏళ్లలో 3% వాటా దక్కించుకున్నారు. తాజాగా RR ₹15,301 కోట్లకు అమ్ముడవడంతో ఆ 3% విలువ ఏకంగా ₹460 కోట్లకు చేరింది. ఇప్పుడు వార్న్ పిల్లలు కోటీశ్వరులయ్యారు.