News November 9, 2025
సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి సర్క్యులర్ జారీ

సింగరేణి సంస్థలో అంతర్గత అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. ఈ 2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23, సివిల్‌లో 4, ఈ 1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్‌లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు
Similar News
News April 3, 2026
ఇరాన్‌లో కాదు.. USలో ‘పాలన’ మారుతోంది!

ఇరాన్‌లో <<16787359>>పాలన మార్పు<<>> జరగాలని US అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ ఇరాన్ ప్రతిఘటనతో అది సాధ్యం కాలేదు. అందుకు విరుద్ధంగా US ప్రభుత్వంలో మార్పులు జరుగుతున్నాయి. కీలక ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్‌పై <<19554260>>వేటువేశారు<<>>. FBI చీఫ్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బార్డ్, మరో ఇద్దరి తొలగింపుపైనా చర్చలు జరిగాయని సమాచారం. ఇంకెంత మందిపై వేటు పడుతుందో?
News April 3, 2026
కాళేశ్వరం పునరుద్ధరణపై చర్యలు తీసుకోవాలి: జీవన్ రెడ్డి

జగిత్యాల పట్టణంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కీలకమని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణకు సుమారు ₹500 కోట్లు సరిపోతాయని తెలిపారు. ప్రాణహిత జలాల వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. పునరుద్ధరణ చేపట్టకపోతే లక్షల ఎకరాలకు నీరు దెబ్బతింటాయన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
News April 3, 2026
పెద్దపల్లి; ‘దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం’

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శం అని బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేలరాలిన మొదటి రక్తపు చుక్క అని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.


