News November 9, 2025

పాటీదార్‌కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

image

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్‌అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్‌లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News March 18, 2026

ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

image

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 18, 2026

రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేసింది!

image

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ కంపెనీ 4ఏళ్ల తర్వాత మిడ్ రేంజ్ SUVతో మళ్లీ IND మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఆల్ న్యూ డస్టర్’ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో రాగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభ ధర రూ.10.49లక్షలుగా ఉంది. ఇది గ్రాండ్ విటారా, క్రెటా, టాటా సియెర్రాకు పోటీ ఇవ్వనుంది. ఇక ఇదే మోడల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ 1.8L ఇంజిన్, 1.4 KWH బ్యాటరీతో త్వరలో లాంచ్ కానుంది.

News March 18, 2026

‘హంట్’ మొదలుపెట్టిన రష్మిక!

image

వివాహ వేడుకలు పూర్తి చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్న తన తర్వాతి చిత్రం ‘మైసా’పై ఫోకస్ పెట్టారు. ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ‘ది హంట్ బిగిన్స్’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. గిరిజన తెగకు చెందిన మహిళగా ‘మైసా’లో రష్మిక కనిపించనున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.