News November 9, 2025

గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో ఓటమి

image

గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
* ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.

Similar News

News November 9, 2025

ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

image

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News November 9, 2025

PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<>PGIMER<<>>) 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 19న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MDS, డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News November 9, 2025

జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

image

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్‌ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?