News November 9, 2025

గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 9, 2025

షట్‌డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

image

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.

News November 9, 2025

జనసేనకు సైబర్ నేరగాళ్ల షాక్

image

జనసేనకు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఆ పార్టీ అఫీషియల్ ఎక్స్ (ట్విటర్) అకౌంట్‌ను హ్యాక్ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా గుర్తించినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలు, పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల పోస్టులు కనిపించే అకౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్‌కు సంబంధించిన ట్వీట్స్ కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాలు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

News November 9, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, పదినిమిషాల తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి.