News November 9, 2025
తెలంగాణ రైతులకు బిహార్ ఎన్నికల దెబ్బ!

బిహార్ ఎన్నికలు రైతులకు సమస్యను తెచ్చి పెట్టాయి. ఓటేసేందుకు బిహారీలు సొంత రాష్ట్రానికి వెళ్తుండటంతో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ కావడం లేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో 20వేల మంది హమాలీలు ఉంటే 18వేల మంది బిహారీలే. ఓటేసేందుకు రాజకీయ పార్టీలు వారికి రూ.5వేల చొప్పున ఇచ్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న అక్కడ ఎన్నికలు ముగుస్తాయి.
Similar News
News November 9, 2025
షట్‌డౌన్ ఎఫెక్ట్: 1,460 విమానాల రద్దు

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఎఫెక్ట్ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. రెండో రోజు ఏకంగా 1,460 విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేశాయి. మరో 6 వేలకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తొలి రోజు 1,025 విమానాలు రద్దు కాగా, 7 వేలకు పైగా డిలే అయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా సమస్యల కారణంగా 40 మేజర్ ఎయిర్ పోర్టుల్లో 4 శాతం డైలీ సర్వీసులను క్యాన్సిల్ చేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది.
News November 9, 2025
జనసేనకు సైబర్ నేరగాళ్ల షాక్

జనసేనకు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఆ పార్టీ అఫీషియల్ ఎక్స్ (ట్విటర్) అకౌంట్‌ను హ్యాక్ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా గుర్తించినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలు, పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల పోస్టులు కనిపించే అకౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్‌కు సంబంధించిన ట్వీట్స్ కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాలు సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
News November 9, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్‌లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, పదినిమిషాల తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి.


