News November 9, 2025
విశాఖ: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

విశాఖలో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మినగర్‌కు చెందిన టి.రమ ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మారలేదు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
వనపర్తి: ర్యాగింగ్ పై నిఘా.. SP WARNING

వనపర్తి జిల్లా కేంద్రం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలిసిన, చూసిన వారు యాంటీ ర్యాగింగ్ కమిటీ, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు పోలీసులు, కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని సూచించారు.
News November 9, 2025
NLG: అమ్మాయిలతో ఇలా రీల్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

SMలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసేవారిపై HYD పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువతితో రొమాన్స్ చేస్తూ నల్గొండకు చెందిన మైనర్ ఆటో నడిపిన ఘటనపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యకరమైన చేష్టలతో రీల్స్ చేసి SMలో అప్‌లోడ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్‌లో పరువు పోయేలా వికృత రీల్స్ చేసి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కించకండి.


