News November 9, 2025

కాగజ్‌నగర్: పేదలకు అందని కంటి వైద్యం

image

కాగజ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Similar News

News November 9, 2025

మల్లె మొగ్గలను తొలిచే పురుగుల నివారణ ఎలా?

image

మల్లె తోటల్లో మొగ్గలను తొలిచి తినే పురుగు వల్ల పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని నివారణకు 5 శాతం వేప కాషాయం లేదా థయోక్లోప్రిడ్ 21.7% S.C. 1ml లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% S.C 0.3ml లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 0.3మి.లీ. లేదా క్వినాల్ ఫాస్ 25% ఇ.సి. 2మి.లీ.లలో ఏదైనా ఒకదానిని లీటరు నీటికి కలుపుకొని మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఎకరానికి 6 నుంచి 8 చొప్పున లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.

News November 9, 2025

జగిత్యాల జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చలితీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి రోజురోజుకు పెరుగుతోంది. గొల్లపల్లి, మన్నెగూడెం, గోవిందారంలో అత్యల్పంగా 14.8℃, పుడూర్, నేరెల్ల, రాఘవపేట, కథలాపూర్ 15.0, పెగడపల్లె, తిరమలాపూర్ 15.1, మల్యాల, మద్దుట్ల, మల్లాపూర్, జగ్గసాగర్, మేడిపల్లి, సారంగాపూర్ 15.3, కోరుట్ల, ఐలాపూర్, గోదూరు 15.4, రాయికల్ 15.5, పొలాస 15.6, జగిత్యాల, మెట్పల్లి 15.7, ఎండపల్లి, గుల్లకోట, సిరికొండ 16.1, అల్లీపూర్లో 16.2℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News November 9, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కవిత

image

వరంగల్ భద్రకాళి అమ్మవారిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలని కవిత ఆకాంక్షించారు.