News April 11, 2024

VZM: ‘ఫలితాలు సరే.. మూల్యాంకనం డబ్బులేవీ’?

image

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తయిన వారం రోజుల లోపే విడుదల కానున్నాయి. అయితే పరీక్షలు నిరాటంకంగా జరిపించిన అధ్యాపకుల సేవలు మాత్రం ఇంటర్ బోర్డు విస్మరించిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్స్ రెమ్యూనరేషన్ గానీ, మార్చిలో జరిగిన పరీక్షల ఇన్విజిలేషన్ రెమ్యూనరేషన్ గానీ అనంతరం జరిగిన పేపర్ల మూల్యాంకనం రెమ్యూనరేషన్ గానీ తమకి అందకపోవడం దారుణమని అంటున్నారు.

Similar News

News March 28, 2026

VZM: నేర నియంత్రణకు కట్టుదిట్టమైన వాహన తనిఖీలు

image

జిల్లాలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్‌తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని ఆయన చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మోటారు వాహన చట్టం ఉల్లంఘించిన వారిపై ఈ-చలానాలు విధిస్తున్నామన్నారు.

News March 28, 2026

VZM: టెన్త్ పరీక్షకు 99.72 శాతం హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పదో తరగతి జీవ శాస్త్రం పరీక్షకు 99.72 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా మొత్తం 22969 మంది హాజరు కావల్సి ఉండగా వారిలో 22,905 మంది హాజరయ్యారన్నారు. కేవలం 64 మంది విద్యార్ధులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.

News March 28, 2026

జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

image

ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్‌రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లు అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు. బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.