News April 11, 2024

మీకు చేతకాకుంటే చెప్పండి.. మేము చూసుకుంటాం: రాజ్‌నాథ్

image

పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం పాక్‌కు చేతకాకపోతే ఆ బాధ్యతలు అందుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిరత నెలకొల్పాలని కుట్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉగ్రవాదులు పాక్‌లో తలదాచుకున్నా వెంటాడి చంపుతామన్న రాజ్‌నాథ్ ఇప్పుడు మరోసారి తన దూకుడును ప్రదర్శించారు.

Similar News

News March 10, 2026

డ్రోన్ వ్యాపారంలోకి ట్రంప్ కుమారులు

image

US-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ డ్రోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. మిలిటరీ అవసరాల కోసం అటానమస్ డ్రోన్లను తయారు చేసే ‘పవరస్’ సంస్థలో వీరు పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు తండ్రి యుద్ధానికి ఆదేశాలిస్తుంటే మరోవైపు కుమారులు దానికి అవసరమైన ఆయుధాల వ్యాపారంలోకి ప్రవేశించడం ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు.

News March 10, 2026

గ్యాస్ సరఫరాలో వీటికే ప్రయారిటీ: ఆయిల్ సంస్థలు

image

గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం నేపథ్యంలో గ్యాస్ కొరతపై ఇండియన్, HP, భారత్ పెట్రోలియం సంస్థలు కీలక ప్రకటన చేశాయి. డొమెస్టిక్ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సెక్టార్స్‌కు ప్రయారిటీ ప్రకారం సప్లై చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మిగతా నాన్-డొమెస్టిక్ సెక్టార్స్ నుంచే వచ్చే విజ్ఞప్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ పరిశీలించి సరఫరా చేస్తామని వెల్లడించాయి.

News March 10, 2026

తల్లి, చెల్లిని దూషించే సంస్కృతి పోగొట్టేలా!

image

మహిళల గౌరవాన్ని కాపాడేందుకు మహారాష్ట్రలోని కొల్గావ్ గ్రామ పంచాయతీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గొడవల్లో తల్లి, చెల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషిస్తే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించింది. దీనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కఠిన నిబంధనలు అన్నిచోట్లా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నిర్ణయం అసభ్య సంస్కృతికి అడ్డుకట్ట వేస్తుందని పలువురు ఆశిస్తున్నారు. మీ కామెంట్?